జూబ్లీహిల్స్ బైపోల్: కీలక పరిణామం, పార్టీ నేతలతో ‘గులాబీ బాస్’ భేటీ.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ, బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ ప్రధాన నేతలతో సమావేశమయ్యారు. భేటీలో మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరావు, సునీతా లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో వ్యూహాలు, నియోజకవర్గ పరిధిలోని తాజా రాజకీయ పరిణామాలు, ఇంటిటికీ ప్రచారం, పార్టీ జాయినింగ్స్ పై చర్చించారు.