హార్మోన్ల అసమతుల్యతకు సుప్త బద్ద కోణాసనం: నిపుణులు సూచనలు
జీవనశైలి మార్పులు, ఆహార అలవాట్లు, పోషకాల లోపాలు వంటి కారణాలతో శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడతుందని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంగా నిరంతరం అలసట, ఒత్తిడి, ఏకాగ్రతలో సమస్యలు, అధిక చెమటలు, ముఖంపై పింపుల్స్, బరువు మార్పులు వంటి సమస్యలు తలెత్తవచ్చు.
నిపుణుల సూచనల ప్రకారం, వీటికి పెసాలేదు, సులభమైన పరిష్కారం ఉంది. అదే సుప్త బద్ద కోణాసనం (Supta Badda Konasana). ఆసనం చేయడానికి, ముందు నేలపై నిటారుగా పడి, రెండు మోకాళ్లను పక్కలకు మడిచి, పాదాలను ఒకదానికి ఒకటి తాకించాలి. వాటిని బాడీ వైపు తీసుకెళ్తూ మెల్లగా ఒత్తిడి చేయాలి. తరువాత అరచేతులను పైకి ఉంచి, బ్యాక్ నేలకు తాకేలా తీసుకురావాలి. ఇప్పుడు మెల్లగా శ్వాస తీసుకుంటూ వదలాలి. ఈ ఆసనం సుమారు 10 నిమిషాల పాటు చేయడం సరిపోతుంది.
ఈ ఆసనం వల్ల హార్మోన్ల అసమతుల్యత తగ్గి ఒత్తిడి తగ్గుతుంది. నాణ్యమైన నిద్ర వచ్చేలా చేస్తుంది. అలాగే జీర్ణ సమస్యలు తొలగిపోతాయి, నడుము నొప్పి తగ్గుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ సాఫీగా జరుగుతుంది.