• ⚡ రాశి ఫలాలు

For Advt Booking : 0987654321

నిపుణ్ ఇండియా

నిజమైన వార్తలకు నిబద్ధత

  • హిందీ
  • ఇంగ్లీష్
తాజా వార్తలు

పార్టీల్లో ‘చీర్స్’ ఎందుకు అంటారు? ఆసక్తికర వెనుకstory

పార్టీల్లో ‘చీర్స్’ ఎందుకు అంటారు? ఆసక్తికర వెనుకstory
  • PublishedOctober 24, 2025

బర్త్‌డే పార్టీ, బ్యాచిలర్ పార్టీ, లవ్ ఫెయిల్ పార్టీ, సక్సెస్ పార్టీ, సంతోషం అనిపించినా పార్టీ, బాధగా ఉన్నా పార్టీ… సందర్భం ఏదైనా, ఇప్పుడు పార్టీ చేయడం చాలా కామన్ అయిపోయింది. ఫ్రెండ్స్ కలిసే సరికి కొంతమంది కలిసి మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే డ్రింక్ చేసేముందు సాధారణంగా వినిపించే మాట ‘చీర్స్’… అసలు దీని వెనుక ఏముంది అనేది చాలా మందికి తెలియదు.

అసలు, ‘చీర్స్ (Cheer)’ అనే పదం ఫ్రెంచ్ పదం ‘చియర్’ నుండి వచ్చింది. దీని అర్థం ఆనందం. పార్టీలో అందరూ కలిసి చీర్స్ చెప్పడం వల్ల ఉత్సాహం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మద్యం తాగడం ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్‌గా మారింది, కానీ చీర్స్ సంప్రదాయం మధ్యయుగం నాటి పరిస్థితుల నుంచి ఉద్భవించింది.

పురాతన కథనం ప్రకారం, మధ్యయుగంలో దారి దోపిడి దొంగలు ఎక్కువగా ఉండేవారు. వారు కలిసి చేసిన దొంగతనం విజయవంతమైతే, అందరూ ఒక చోట చేరి మద్యం తాగేవారు. కానీ కొందరు తమ సొంతం చేసుకోవడానికి మిగతావారి గ్లాసులలో విషం కలిపే ప్రయత్నం చేసేవారట. ఈ ప్రమాదాన్ని నివారించడానికి, అందరూ కలిసే గ్లాసులో విషం లేదని చూపించేందుకు ‘చీర్స్’ కొట్టేవారు.

చీర్స్ కొట్టడం వల్ల ప్రతి గ్లాసులోని మద్యం ఒకదానికొకటి కలిసిపోతుంది, ఎవరు విషం కలిపితే అందరూ చనిపోతారని భయం ఉండేది. ఈ సంప్రదాయం క్రమంగా దేశ విదేశాలకు వ్యాపించి, ఇప్పటికీ పార్టీల్లో కొనసాగుతోంది.

Written By
nipun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *