• ⚡ రాశి ఫలాలు

For Advt Booking : 0987654321

నిపుణ్ ఇండియా

నిజమైన వార్తలకు నిబద్ధత

  • హిందీ
  • ఇంగ్లీష్
తాజా వార్తలు సినిమా

మలయాళ్ బ్లాక్‌బస్టర్ ‘లోకా: చాప్టర్ 1’ అక్టోబర్ 31 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్

మలయాళ్ బ్లాక్‌బస్టర్ ‘లోకా: చాప్టర్ 1’ అక్టోబర్ 31 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్
  • PublishedOctober 24, 2025

స్టార్ హీరోల సినిమాలు అయినప్పటికీ, కొన్ని సినిమాలు నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలు కూడా కేవలం నాలుగు వారాల్లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్స్‌కు వెళ్లడం తగ్గించడంతో, దర్శక నిర్మాతలు లాభాల కొరతపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా, మలయాళ సినిమా ‘లోకా: చాప్టర్ 1చంద్ర’ అక్టోబర్ 31 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రాబోతుందని అధికారికంగా ప్రకటించబడింది. ఈ మూవీ ఆగస్టు 28న థియేటర్స్‌లో రిలీజ్ అయి, బాక్సాఫీస్‌లో రికార్డులు తిరగరాశింది.

సినిమా హక్కులను ప్రముఖ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.

కళ్యాణి ప్రియదర్శన్, నస్లీన్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ను అందించగా, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఊహించని లాభాలను తెచ్చింది. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది.

Written By
nipun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *