• ⚡ రాశి ఫలాలు

For Advt Booking : 0987654321

నిపుణ్ ఇండియా

నిజమైన వార్తలకు నిబద్ధత

  • హిందీ
  • ఇంగ్లీష్
తాజా వార్తలు సినిమా

‘కాంతార: చాప్టర్ 1’ పై అల్లు అర్జున్ ప్రశంసలు – రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో అంటున్న ఐకాన్ స్టార్

‘కాంతార: చాప్టర్ 1’ పై అల్లు అర్జున్ ప్రశంసలు – రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో అంటున్న ఐకాన్ స్టార్
  • PublishedOctober 24, 2025

బ్లాక్‌బస్టర్ హిట్ ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను, సినీ సెలబ్రిటీలను సమానంగా ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.818 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, రూ.1000 కోట్ల మార్క్ వైపు దూసుకుపోతోంది.

ఈ చిత్రంపై తాజాగా అల్లు అర్జున్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన ఆయన

“నిన్న రాత్రి ‘కాంతార: చాప్టర్ 1’ చూశాను. సినిమా చూస్తూ నన్ను నేను మర్చిపోయి ట్రాన్స్లోకి వెళ్లిపోయాను. రిషబ్ గారు చేసిన వన్ మ్యాన్ షో అద్భుతం. అలాగే రుక్మిణి వసంత్, జయరామ్ గారు, గుల్షన్ దేవయ్య గారు మరియు ఇతర నటుల ప్రదర్శనలు చాలా బాగున్నాయి. అజనీష్ సంగీతం, అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ, ధరణి ఆర్ట్ డైరెక్షన్, అరుజ్ రాజ్ స్టంట్స్ టాప్ నాచ్. నిర్మాత విజయ్ కిరగందూర్ గారితో పాటు మొత్తం హోంబలే టీంకు అభినందనలు” అని రాశారు.

అల్లు అర్జున్ పోస్ట్ చూసిన అభిమానుల్లో సినిమా చూడాలనే ఆసక్తి మరింత పెరిగింది.

Written By
nipun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *