సెలబ్రిటీల వరుస పెళ్లిళ్లు – రాహుల్ సిప్లిగంజ్ త్వరలో ఓ ఇంటివాడు
కార్తీకమాసం ప్రారంభమవడంతో సినీ ఇండస్ట్రీలో వరుసగా శుభకార్యాలు మొదలయ్యాయి. అక్టోబర్ చివరి వారంలో పలువురు సెలబ్రిటీలు తమ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారు. అల్లు శిరీష్ నిశ్చితార్థం ఈ నెలాఖరులో జరగబోతున్న విషయం తెలిసిందే. అలాగే టాలీవుడ్ హీరో నారా రోహిత్, సిర లేల్ల పెళ్లి అక్టోబర్ 30న జరగనుంది.
ఇక మరోవైపు, ‘ఆర్ఆర్ఆర్’ పాటతో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల తన ప్రేయసి హరిణ్యతో నిశ్చితార్థం జరుపుకున్న రాహుల్, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు.
ఇటీవల హరిణ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో లగ్నపత్రిక కార్యక్రమం ఫొటోలు షేర్ చేస్తూ పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయని వెల్లడించింది. ఆ ఫొటోలలో రాహుల్, హరిణ్య జంట పసుపు దంచుతూ, చెంప ముద్దులు పెట్టుకుంటూ చిలిపి చేష్టలతో అందరినీ ఆకట్టుకున్నారు.
చూడముచ్చటగా ఉన్న ఈ జంట త్వరలోనే ఏడడుగులు వేయబోతుండగా, నెటిజన్లు సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెబుతున్నారు.