• ⚡ రాశి ఫలాలు

For Advt Booking : 0987654321

నిపుణ్ ఇండియా

నిజమైన వార్తలకు నిబద్ధత

  • హిందీ
  • ఇంగ్లీష్
ఆంధ్రప్రదేశ్ క్రైమ్

మోహన్ లాల్ కు కేరళ హైకోర్ట్ ఎదురుదెబ్బ – ఏనుగు దంతాల ఓనర్షిప్ రద్దు

మోహన్ లాల్ కు కేరళ హైకోర్ట్ ఎదురుదెబ్బ – ఏనుగు దంతాల ఓనర్షిప్ రద్దు
  • PublishedOctober 24, 2025

మలయాళ సూపర్‌స్టార్, నటుడు మోహన్ లాల్ కు కేరళ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సేకరించిన ఏనుగు దంతాలను చట్టబద్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. అలాగే, మోహన్ లాల్ కు జారీ చేసిన లైసెన్స్ కూడా రద్దు చేయబడింది.

హైకోర్టు, 2015లో ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో లోపాలు ఉన్నాయని, అధికారిక గెజిట్‌లో ప్రచురించనందున వాటి చట్టపరిమితి లేదని స్పష్టం చేసింది. కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది.

2011 డిసెంబర్ 21న, కొచ్చిలోని మోహన్ లాల్ ఇంటిలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఇంటిలో రెండు జతల ఏనుగు దంతాలు, 13 ఐవరీ వస్తువులు స్వాధీనమయ్యాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాటిని చట్టవిరుద్ధంగా కలిగి ఉన్నారంటూ Wildlife Protection Act ఉల్లంఘన కేసు నమోదు చేసింది.

2016లో రాష్ట్ర ప్రభుత్వం ఓనర్షిప్ సర్టిఫికెట్ జారీ చేసి కేసును ఉపసంహరించుకోవాలని ప్రయత్నించింది, కానీ పెరుంబపూర్ మేజిస్ట్రేట్ కోర్టు దీన్ని తిరస్కరించింది. మోహన్ లాల్ హైకోర్టును ఆశ్రయించగా, మరోవైపు జేమ్స్ మాథ్యూ అనే వ్యక్తి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు.

ఈ రెండు పిటిషన్లపై విచారణ చేసిన హైకోర్టు, మోహన్ లాల్ కు ఇచ్చిన ఓనర్షిప్ సర్టిఫికెట్ చట్టవిరుద్ధమని రద్దు చేసింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రక్రియలో లోపాలున్నాయని, కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది.

Written By
nipun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *