• ⚡ రాశి ఫలాలు

For Advt Booking : 0987654321

నిపుణ్ ఇండియా

నిజమైన వార్తలకు నిబద్ధత

  • హిందీ
  • ఇంగ్లీష్
తాజా వార్తలు సినిమా

ధనుష్ ‘ఇడ్లీ కడై’ అక్టోబర్ 29 నుంచి నెటిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్

ధనుష్ ‘ఇడ్లీ కడై’ అక్టోబర్ 29 నుంచి నెటిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్
  • PublishedOctober 24, 2025

హీరోగా మాత్రమే కాకుండా దర్శకత్వం వహిస్తూ, ధనుష్ ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. వరుస బ్లాక్‌బస్టర్స్‌తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఆయన, ఇటీవల స్వయంగా దర్శకత్వంలో వచ్చిన ‘ఇడ్లీ కడై (Idli Kadai)’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమాను తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ పేరుతో రిలీజ్ చేసి మంచి రెస్పాన్స్ను అందుకుంది. ధనుష్ హీరోగా, దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానే వ్యవహరించారు. ఇందులో నిత్యామీనన్ హీరోయిన్గా నటించగా, షాలిని పాండే, సత్యరాజ్, అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషించారు. సంగీతం జీవీ ప్రకాష్ అందించగా, వండర్ బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మించారు.

ఈ సినిమా అక్టోబర్ 1న విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా, ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు అధికారిక ప్రకటన వెలువడింది. నెటిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా అక్టోబర్ 29 నుంచి అందుబాటులో ఉంటుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అయిదు భాషల్లో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయనుంది.

ఈ వార్తను తెలుసుకున్న సినీ ప్రియుల్లో జోష్ నెలకొంది.

Written By
nipun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *