• ⚡ రాశి ఫలాలు

For Advt Booking : 0987654321

నిపుణ్ ఇండియా

నిజమైన వార్తలకు నిబద్ధత

  • హిందీ
  • ఇంగ్లీష్
తాజా వార్తలు స్పోర్ట్స్

మహిళల వరల్డ్ కప్: టీమ్ ఇండియా సెమీఫైనల్లోకి, న్యూజిలాండ్‌పై 53 పరుగుల వ్యత్యాసంతో విజయం

మహిళల వరల్డ్ కప్: టీమ్ ఇండియా సెమీఫైనల్లోకి, న్యూజిలాండ్‌పై 53 పరుగుల వ్యత్యాసంతో విజయం
  • PublishedOctober 24, 2025

మహిళల వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా అమ్మాయిలు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ మహిళలపై పూర్తి ఆధిపత్యం చూపిస్తూ 53 పరుగుల తేడాతో విజయం సాధించారు.

గత రెండు మ్యాచులలో అద్భుతంగా రాణించిన ఓపెనర్ స్మృతి మంధాన (109) సెంచరీతో చెలరేగగా, మరో ఓపెనర్ ప్రతీక రావల్ (122) వరల్డ్ కప్‌లో తొలి శతకంతో మెరిసింది. వీరికితోడు జెమీమా రోడ్రిగ్స్ (76 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్ ఆడింది. వీరి మెరుపులతో వర్షం కారణంగా 49 ఓవర్లకు తగ్గించబడిన మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిందీ.

ఈ విజయం భారత మహిళల క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది.

Written By
nipun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *